Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్,అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు

    Author VENKATESH | 10 Oct 2026, 09:55 PM | ములుగు
    ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్,అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు

    - డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమానులదే బాధ్యత
    - రోడ్డు ప్రమాదాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజలకు కూడా సమిష్టి బాధ్యత
    - వాహనాలను నిర్లక్ష్యంగా నడిపే వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేలా వెసులుబాటు
    - ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరడమే పోలీసులు అంతిమ లక్ష్యం
    - ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్
    ములుగు జిల్లా ప్రతినిధి,
    అక్టోబర్ 09 (బీవీకే న్యూస్):
    ములుగు జిల్లాలో ఇసుక లారీల ద్వారా జరుగుతున్న అతివేగ ప్రయాణం,నిర్లక్ష్యపు డ్రైవింగ్,రహదారులపై అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.ప్రజల ప్రాణ భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాహనాలు నడిపినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా లారీలను నిలిపినా సంబంధిత వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ తెలిపారు. అదేవిధంగా ఇసుక లారీ డ్రైవర్లు నిర్దేశిత వేగ పరిమితులను తప్పని సరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా లేదా ప్రమాద కరంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ముఖ్యంగా జనావాస ప్రాంతాలు,ప్రధాన రహదారులు,విద్యా సంస్థలు,రద్దీగా ఉండే కూడళ్ల వద్ద అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఆదేశించారు. అదేవిధంగా రహదారులపై ప్రధాన కూడళ్ల వద్ద, ప్రజలకు,ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఇసుక లారీలను అక్రమంగా పార్కింగ్ చేయవద్దని, వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.ట్రాఫిక్ నియంత్రణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా ఇసుక లారీల యజమానులు తమ డ్రైవర్లకు రహదారి భద్రతా నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ తీసుకోవాలని అన్నారు. ఇట్టి నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా వాహన డ్రైవర్లతో పాటు యజమానులను కూడా బాధ్యులను చేస్తామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాహనాలను చట్ట ప్రకారం సీజ్ చేస్తామని హెచ్చరించారు.డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకూడదని,నిర్లక్ష్యం వేరొకరి ప్రాణాలకు అపాయం కలిగించకూడదని హెచ్చరించారు.ములుగు జిల్లాలోకి వచ్చి వెళ్లే ప్రతి లారీని తనిఖీ చేయడం జరుగుతుందని డ్రైవర్లు తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు.ప్రజలు కూడా ఎవరైనా వ్యక్తులు తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించిన,ఏదైనావాహనం నిర్లక్ష్యంగా,ప్రజలకు హాని కలిగించేలా నడుపుతున్నట్లు చూసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. తద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ములుగు జిల్లాలోని సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి,డ్రంక్ అండ్ డ్రైవ్,అతివేగం,నిర్లక్ష్యపుడ్రైవింగ్,అక్రమపార్కింగ్‌కు పాల్పడే వారిపై వర్తించే చట్టాల ప్రకారం జరిమానాలు విధించడం తోపాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.రహదారి భద్రతను పరిరక్షించడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ప్రమాదాలను నివారించడమే ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని,ప్రజల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి ఉల్లంఘనలనూ సహించేది లేదని,ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు పోలీస్ శాఖకు సహకరిస్తూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు కూడా రోడ్డు భద్రతలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు