Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం _

    Author VENKATESH | 09 Oct 2026, 08:37 PM | కరీంనగర్
    మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం _

    దేశాభివృద్ధికి 'సౌభాగ్యానికి 'ప్రజారోగ్యంముఖ్యమైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక మానసిక 'సాంఘిక 'ఆధ్యాత్మిక 'కుశలత అంతే కానీ కేవలం ఒక వ్యాధి గాని వైకల్యం కాని లేకపోవడం మాత్రమే కాదుఅని పేర్కోవడం గమనార్హం. మానసిక ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక శక్తిని ఉత్పత్తినిపెంపొందిస్తుంది.మానసిక ఆరోగ్యం మానసిక శ్రేయస్సుకు పునాది లాంటిది.జాతిలో శ్రామిక సామర్థ్యం ఇనుమడించి సమర్థవంతంగాపనిచేయడానికి దోహదపడుతుంది.
    ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏట అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది. 1992లో ప్రారంభమైన ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో ప్రపంచ మానవాళి మానసిక ఆరోగ్య ప్రాధాన్యత పాటించాల్సిన ' ఆరోగ్య సూత్రాలు 'జాగ్రత్తలు మనోధైర్యం 'ఆత్మస్థైర్యము మొ" అంశాలపై చర్చలు సమావేశాలు నిర్వహిస్తారు.
    ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 నినాదం
    పనిచేసి ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య అంశం తీసుకుని యాజమాన్యాలు మార్గ నిర్దేశనాలిస్తూ ఆరోగ్య అసమానతలు రూపుమాపిలనే లక్ష్యంతో ముందుకు సాగడం. శారీరిక మానసిక ఆరోగ్యమే మానవ ప్రగతికి తొలి మెట్టు అనే అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
    ఆరోగ్య మే మహాభాగ్యం అనేది" సమాజం యొక్క జీవన విధానం కావాలి. ఆరోగ్యం బాగుంటెనే అంతా బాగుంటుంది.నేటి వేగవంతమైన జీవన విధానంలో మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. మానసిక వైద్య నిపుణులు. నాటి కాలాన్ని బట్టి పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాని ‌ఇప్పటి ‌పరిస్థితులు వేరు.
    పోటీ_ టెన్షన్
    "హైటెక్ యుగంలో మానవజీవితం పరుగుల మయమై "పోటీ" నెలకొన్నది. ఉదయం మేల్కొనప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒకటే టెన్షన్ టెన్షన్ .ఉరుకుల పరుగుల జీవితం కనీసం కుటుంబ సబ్యులతో‌ సైతం గడుపలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
    యువత_ మానసిక సమస్యలు నేడు ఔత్సాహిక యువతరంలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొందరు మానసిక సమస్యలు బయటకు చెప్పుకోలేక లోలోపల సత మత మౌతున్నారని ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి.
    మారిన సామాజిక' ఆర్థిక సాంస్కృతిక' సాంకేతిక మార్పుల వల్ల మానవులు ఎన్నో ఒడిదొడుకులు ఎదురుకొంటున్నారు.
    పోలికత్వం - పోటీతత్వం కాలానుగుణంగా అన్నివిషయాలలో మానవుడు వేగాన్నిపెంచాడు. అన్నిరంగాలలో సంపూర్ణ "పోలికత్వం " "పోటీతత్వం" పెరిగి పోయి భౌతిక సంపదపై మోజు పెరిగింది. అందరికంటె . ఎక్కువ ఆర్థిక సంపద కలిగివుండాలన్న "వాణిజ్యవాదం" రాజ్యమేలుతుంది.భౌతిక సంపదపట్ల కాంక్ష పెరిగి బౌద్ధిక తాత్వికత తరిగి 'నైతికతక మానవీయ విలువలు క్షీణించి మానసిక ఆందోళన ఒత్తిడి మనిషి పాలిటి శాపంగా పరిణమించింది. ఈనేపథ్యంలో మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
    జీవిత లక్ష్యాలను సాధించడానికి ఆనందంగా జీవించేందుకు శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి.ఇందుకు కావలసిన అవగాహన చైతన్యం ప్రజల్లో కలిగించి అప్రమత్తంగా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికలను రుపొందించుకుని తగిన జాగ్రత్తలుపాటించాలి .
    మానసిక ఆరోగ్యాన్ని అశ్రద్ద చెసిన చికిత్సను మద్యలో ఆపి వేసిన అదుపు తప్పే ప్రమాదం వుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావ చూపిస్తాయి.
    ఆరోగ్య సూత్రాలపై అవగాహన
    మానసిక ఆరోగ్యం శారీరక ' ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.మానవుడు శారీరక మానసిక ధారుడ్యత పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అవసరమైన ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
    మానసిక వ్యాధుల మీద చర్చ జరగాలి
    మానసిక రోగం చెబితే చాలా
    మంది బయంతో వణికి పోతారు.మానసిక జబ్బు గురించి బాహాటంగా చర్చించడానికి .చెప్పుకోవడానికి సంకొచిస్తారు తమలో తాము మదన పడి వ్యాధి తీవ్రతను పెంచుకునే థొరిణి పెరిగిందని ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి.
    ప్రపంచ వ్యాప్తంగా 450 మిలియన్ పైగా మానసిక రుగ్మతలతో సతమత మౌతున్నారని వైద్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. విశ్వ వ్యాప్తంగా 13% అనారోగ్యాలు మానసిక సంబండమైనవిగా గుర్తించారు. ప్రపంచ స్థాయిలో మానసిక ఆందోళనలతో ఏడాదికి 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక బలహీనలతో79% ఆత్మహత్యలు దిగువ పేద మధ్యతరగతి కుటుంబాల్లో నమోదైనాయి. మానసిక రోగులకు ట్రీట్మెంట్ కొరకు ప్రపంచ వ్యాప్తంగా 16 ట్రిలియన్స్ డాలర్ల ఆర్థిక భారం పడుతుంది.
    2020 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 45 కోట్ల మంది ప్రజలు మానసిక దుర్బలత్వంతో' వైకల్ల్యముతో బాధపడుతున్నారు. రాను రాను ఈ సమస్సతీవ్రమయ్యే సూచనలున్నాయి. మానసిక ఒత్తిడి అనేది రెండవ అతిపెద్ద తీవ్రమైన వ్యాధిగా మారి ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపుతోంది.( ముర్రే అండ్ లోపెజ్) 1996 లో జరిపిన అధ్యయనం ప్రకారం అభివృధి చెందిన 'అభివృధి చెందుతున్న దేశాలలో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు తీవ్రమై మానసిక వ్యాధుల.వైద్య ఖర్చులు
    మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది తన పరిశోధనలో చెప్పాడు.
    మానసిక వైద్య నిపుణుల అంచనాలు
    మానసిక వైద్య నిపుణుల అంచనా ప్రకారం 40 శాతం మంది పిచ్చి వాళ్లే ఉన్నారని వైద్యారోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి సమాజములో 2.శాతం మంది మాత్రమే మానసికంగా ఫీట్ గా ఉన్నట్లు అంచనాలు
    తెలుపుతున్నాయి.మానసిక వైకల్ల్యం వచ్చిన వారిలో సగానికి పైగా 14 ఏళ్ల లోపు వయసు నుంచి ఈ సమస్య ప్రారంభమౌతుంది .మొత్తం 20 శాతం మంది బాల బాలికల్లో ఈ అవలక్షణం ఉన్నట్లు తేలింది.భయంకర సంఘటనలు సామాజిక పరిస్థితుల కారణంగా మానసిక వైకల్యం చెందడం సర్వ సాధారణ కారణంగా చెబుతున్నారు.
    మానసిక రుగ్మతలు _రకాలు మన సమాజములో వింత ప్రవర్తనలు వింత పోకడలు ఉన్న వ్యక్తులు కనిపిస్తుంటారు. ఒకరికి డబ్బు పిచ్చి' ఒకరికి తిండి పిచ్చి ' నగల పిచ్చి' ఆస్తుల సంపాదన పిచ్చి' సినిమాలు విపరీతంగా చూడడం' నటన
    పిచ్చి 'గొప్పలు చెప్పుకునే పిచ్చి' ఆడంబరాలకు పోయేపిచ్చి' వివిధ రకాల. మానసిక రుగ్మతలు వున్న వారుమనచుట్టూకనిపిస్తుంటారు. అవథులు దాటిన అలవాటు లక్షణం పిచ్చి కింద పరిగణిస్తారు.
    మానసిక వైఫల్యాలు
    వైద్య పరిభాషలో మానసిక వైపల్ల్యాలు అనేక రకాలు గా పెరుకొంటారు. డిప్రెషన్ 'యంగ్సిటి 'యాంగ్సిటి నురోసిస్ 'బైపోలార్ డిజార్డర్ సోషల్ 'యంగ్సిటీ డిజార్డర్
    పానిక్ డిజార్డర్ 'అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ 'పోస్ట్ ట్రామా టెక్ డిజార్డర్' ఫోబియా 'మానియా' స్క్రిజోఫెనియ' డిల్లుషన్ డిజార్డర్ స్లీప్ డిజార్డర్ ' ఇన్ఫరియారిటీ' కాంప్లెక్స్'సుపిరియారిటీ కాంప్లెక్స్ ' అడ్డిక్షన్ 'ఇల్లుషన్ 'లాంటి మానసిక వైకల్యాలు వుంటాయి. మానసిక ఉద్రిక్తతలను తగ్గించుకో క పోవడం వల్ల నిగ్రహశక్తి ‌ కోల్పోవడం వల్ల మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి . కష్ట కాలంలో (సమయములో) క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడి కి లోనుకాకుండా కుంగి పోకుండా మనోధైర్యం తో ఆలోచనలు చేస్తే మెదడు సక్రమంగా పనిచేస్తుందని వైద్యులు సలహా ఇస్తుంటారు‌ . మానసిక ఒత్తిడి విషవలయంలో పడకుండా ఓరుపు 'సహనం 'ప్రశాంతత
    నిగ్రహ 'అలవరుచుకోవాలి.

    *మానసిక ప్రశాంతత_ జీవనశైలి
    మానసిక ప్రశాంతత జీవన శైలి కావాలి.రోజు వ్యాయామం 'మెడిటేషన్ 'సోషల్ ఇంటరాక్షన్ ' పౌష్ఠిక ఆహారం 'రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ' మనసుకు హాయి నిచ్చే సంగీతం వినడం .భజన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం. పెద్ద., సమస్యలు వచ్చినప్పుడు ఆందోళనకు గురికాకుండా కుంగి పోకుండా ఉద్రిక్తతలకు లోనుకాకండ మనసును దృఢంగా వుంచుకోవాలి.ప్రతి సమస్యకు పరిష్కారం వుందన్న విషయాన్ని బలంగా నమ్మాలి. మన పట్ల మనకు నమ్మకం వుండాలి. సహనంతో సమస్య పరిష్కార మార్గాలనుఅనుసరించాలి.ఇలా చేస్తే మానసిక రుగ్మతలు అనారోగ్య సమస్యలు మన దరి చేరవని మానసిక వైద్యులు చెబుతున్నారు. క్లిష్టతరమైన సమస్యలు వస్తే తల‌‌ మునకలు కాకుండా తోటి వారితో షేర్ చేసుకొని వారి సహాయం సలహా తీసుకుంటే ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది. అందని వాటికి అర్రులు చాచడం నెరవేరని సాధ్యం కాని పనుల గురించి ఆలోచించడం మానుకోవాలి.ఆందోళన చెందకుండ మనసును దృఢంగా వుంచుకోవాలి.
    వృద్ధుల్లో మానసిక కుంగు బాటు ఎక్కువ
    ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం' నవ నాగరికత' విదేశీ సంస్కృతి 'విదేశీ చదువులు' విదేశీ కొలువల పై పెరిగిన క్రేజీ వల్ల వృద్దాప్యంలో వుండే ఒంటరి తల్లి తండ్రుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోయింది. ఆత్మీయత కరువై' ఆంథొళన ఒత్తిడి వారికి శాపంగా పరిణమించింది ఈ స్థితి వల్ల చాలా మంది వృద్దులు మానసిక వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోగ్య సర్వేలో తేలిన నిజం. వృద్ధులతో పాటు మధ్య వయసు వారిలో కూడా మానసిక వ్యాధులు వస్తున్నాయి.మానసిక చికిత్స కేంద్రాలకు వచ్చే వారిలో వృద్దులు 25 శాతం మంది ఉన్నారని సర్వేలో తేలింది. వృద్దులు ఎక్కువగా డిప్రెషన్ 'నిద్రలేమి 'ఆందోళన కుంగుబాటు'డిమెన్షయా లాంటి 'మానసిక రుగ్మతలతో ఆసుపత్రులకువస్తున్నారు.వృద్దాప్యంలో మానసిక అనారోగ్యం కలుగకుండా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులు వృద్ధుల పట్ల ప్రేమ' ఆదరణ చూపించాలి . సకాలంలో వైద్య 'ఆరోగ్య సలహాలు తీసుకొని చికిత్స చేయించుకోవాలి.
    మానసిక సమస్యలు ఏర్పడితే వయసుతో సంబంధం లేకుండా సైక్రటిస్ట్( మానసిక వైద్యుని) వద్ద చికిత్స తీసుకోవాలి.
    వాయిదా వేయడం మానుకోవాలి.
    ఓర్పు 'సహనం ' సంతృప్తి' పాటించాలి
    సమాజం వేగంగా పరుగెడుతుంది.ఉరుకుల పరుగు ల జీవితం లో ఓర్పు' సహనం సమన్వయం 'అలవాటు చేసుకోవాలి. అల్పకాలములో అత్యధిక ధనికులు కావాలని ప్రపంచాన్ని జయించాలని జీవితములో నిరంతరం పరుగులు పెడుతున్నారు. ఈ వేగములో పడికుటుంబ సభ్యులను అయిన వారిని పట్టించుకోవడం లేదు.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
    భంథాలనుతెంచుకోవద్దు
    బంధాలను అనుబంధాలను మరిచిపోతున్నారు."జీవితంలో వేగం ఉండాలి కాని వేగమే జీవితం కాకూడదు".కష్టాల్లో బాధల్లో మన వాళ్ళు ఆత్మీయులు తోడుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది.
    డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు .బంధాలు అనుబంధాలు తెంచుకుంటే తిరిగి రావు.
    నవ్వుతూ జీవించాలి
    వ్యసనాలకు స్వస్తి చెప్పి నవ్వుతూ నవ్విస్తూ జీవిస్తే ప్రశాంతత చేకూరి మానసిక సమస్యలు రావు.కష్టాలు సమస్యలు బాధలు మన జీవితములో అంతర్బాగాలు అవి వుంటూనే ఉంటాయి. వాటితో సహజీవనం చెయ్యల్సిందే .వాటికి భయపడకుండా మనోధైర్యం తో ఎదురుకోవాలి. చింతన మానుకొని ప్రశాంతతను పెంచుకొని శాంతియుత జీవనం కొనసాగిస్తే మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది .మానసిక ఆరోగ్యమే మహాభాగ్యము అనేది మన జీవన శైలి కావాలి.
    ప్రభుత్వాలు _కృషి మానసిక ఆరోగ్య విధానాలు కేవలం మానసిక వైకల్యాలు పరిమితంకాకూడదు."మానసికఆరోగ్యమే" కేంద్రంగా వైద్య ఆరోగ్య విధానాలు రూపొందించాలి.
    ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాల వైద్య 'ఆరోగ్య విధానాలను సమన్వయం చేసుకుంటూకాలానుగుణంగా వస్తున్న వైద్య విధానాల పట్ల అవగాహన చైతన్యం కలిగిస్తుంది. వివిధ ప్రభుత్వాలు అమలుచేస్తున్న వ్యూహాలను ప్రణాళికలను ఏకీకృతం చేస్తూ సంఘటిత పరుస్తోంది .
    మానసిక ఆరోగ్యం కోసం ప్రభుత్వ సమాజం సమిష్టి కృషి చెయ్యాలి.
    పిల్లల మనోవికాసానికి చర్యలు చేపట్టాలి
    భవిష్యత్ మానవ వనరులైన పిల్లల మనోవికాసానికి చేయూతను ఇచ్చే కార్యాచరణకుపూనుకోవాలి.పిల్లల పెంపకం 'చైల్డ్ సైకాలజీ 'అంశాల మీద టీచర్స్ కు తల్లి తండ్రులకు అధ్యాపకులకు "శిక్షణ కేంద్రాలు" ఏర్పాటు చెయ్యాలి. మానసిక ఆరోగ్యం పట్ల యూనివర్సిటీలలో
    అద్యయనం పరిశోధనకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి.
    ఆర్థిక సమస్యల పరిష్కారం ప్రభుత్వ కృషి
    పేదరికం ''నిరుద్యోగం 'ఆర్థిక అసమానతలు 'ప్రాంతీయ
    అసమానతలు 'సామాజిక అంతరాలు స్త్రీ 'పురుష 'లింగ వివక్షత 'ఉమెన్ ట్రాఫికింగ్ బాలకార్మిక వ్యవస్థ 'వెట్టి చాకిరి మొన్నగు సామాజిక 'ఆర్థికసమస్యలనుపరిష్కరించిజీవన భద్రత 'భరోసాకు కావలసిన సామాజిక ,'ఆర్థిక రాజకీయ వాతావరణం ప్రభుత్వాలు కలిపించాలి.
    సాంఘికంగ.ఆర్థికంగా "మహిళలకు సాధికారిత "కలిపించాలి.
    వయో వృద్ధులకు సాంఘిక సహాయాలు అందించడం
    డే సెంటర్స్ "ఓల్డ్ ఏజ్ హోమ్స్" నేలకొల్పాలి.
    పాఠశాలలో మానసిక' ఆరోగ్యాన్ని పెంపొందించే పాఠ్యాంశాలు ప్రవేశ పెట్టాలి. మనో వికాసం' మనోధైర్యం పెంచే కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చెయ్యాలి.
    కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
    పనిచేసే చోట మానసిక ఆరోగ్య సంరక్షణ కొరకు "కౌన్సిలింగ్ కేంద్రాలు"
    నెలకొల్పి సుశిక్షితులైన వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు‌ చెయ్యాలి . ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం అద్వ్యేర్యంలో
    మురికి వాడల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మానసిక ఆరోగ్య శిబిరాలు ప్రభుత్వం నిర్వహించాలి.
    మౌళిక సదుపాయాలు ఆత్మగౌరవం ప్రభుత్వం
    ప్రజలకు మౌలిక సదుపాయాలు గృహ వసతి 'విద్య' వైద్య 'రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేసి వారిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి.
    సమాజంలో ఉద్రిక్తతలు' హింసాత్మక సంఘటనలు జరుగకుండ ప్రభుత్వం శాంతి భద్రతలు ' సంరక్షించే చర్యలు చేపట్టాలి.
    వ్యాయామం 'మెడిటేషన్ యోగ 'ఉదయం వాకింగ్ 'జాగింగ్ సైక్లింగ్ 'స్విమ్మింగ్' షటిల్ 'బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో పాల్గొనాలి.
    పబ్లిక్ 'ప్రైవేట్ 'రంగాలలో పట్టణాలలో' గ్రామాలలో' పబ్లిక్ పార్కులను 'రిక్రియేషన్ సౌకర్యాలను ఏర్పాటు చెయ్యాలి.
    ప్రభుత్వం 'స్థానిక సంస్థలు విద్యా సంస్థలు 'మహిళా' యువజన సంఘాలు 'సామాజిక 'సాంస్కృతిక స్వచంద సంస్థలు' పౌరసమాజం మానసిక ఆరోగ్య అక్షాస్యత పరి వ్యాప్తికి చిత్త శుద్ది తో కృషి చేస్తూ శారీరక మానసిక ఆరోగ్యమే మనిషి ప్రగతికి తొలి.మెట్టు‌అనేలక్ష్యంతో ముందుకు సాగాలి."మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం "అన్నది నినాదం కాకుండా విధానంగా వర్ధిల్లాలి.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    సామాజిక.ఆర్థిక అధ్యయన వేదిక కరీంనగర్
    9440245771