మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం _
దేశాభివృద్ధికి 'సౌభాగ్యానికి 'ప్రజారోగ్యంముఖ్యమైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక మానసిక 'సాంఘిక 'ఆధ్యాత్మిక 'కుశలత అంతే కానీ కేవలం ఒక వ్యాధి గాని వైకల్యం కాని లేకపోవడం మాత్రమే కాదుఅని పేర్కోవడం గమనార్హం. మానసిక ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక శక్తిని ఉత్పత్తినిపెంపొందిస్తుంది.మానసిక ఆరోగ్యం మానసిక శ్రేయస్సుకు పునాది లాంటిది.జాతిలో శ్రామిక సామర్థ్యం ఇనుమడించి సమర్థవంతంగాపనిచేయడానికి దోహదపడుతుంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏట అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది. 1992లో ప్రారంభమైన ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో ప్రపంచ మానవాళి మానసిక ఆరోగ్య ప్రాధాన్యత పాటించాల్సిన ' ఆరోగ్య సూత్రాలు 'జాగ్రత్తలు మనోధైర్యం...