Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’

    Author VENKATESH | 09 Oct 2026, 08:01 PM | నల్గొండ
    ‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’

    బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య అడుగుజాడల్లో నడుస్తూ బీసీల హక్కుల కోసం గుజ్జ సత్యం నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలందిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గుజ్జ సత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సత్యం హోమియోపతి ద్వారా సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. పద్మశాలి సమాజానికి చెందిన ఆయన చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, వృత్తి పరిరక్షణ, ఉపాధి భద్రత కోసం కూడా కృషి చేస్తున్నారని అన్నారు. బీసీ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం, సామాజిక సేవా దృక్పథం కలిగిన గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే బీసీలు, పేద విద్యార్థులు, చేనేత కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు అవకాశం ఉంటుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.