‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’

బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య అడుగుజాడల్లో నడుస్తూ బీసీల హక్కుల కోసం గుజ్జ సత్యం నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్...