Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం..

    Author VENKATESH | 08 Oct 2026, 12:21 PM | Sports
    ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం..

    భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీతో అగార్కర్ పదవీకాలం ముగిసింది. వెంటనే ఖాళీగా ఉన్న సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా రాబోయే సెలక్టర్‌ని బట్టి తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎంపిక ఉండబోతోంది. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆసక్తికర పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.
    బీసీసీఐ దరఖాస్తుల నోటిఫికేషన్‌కు సంబందించిన పోస్టును షేర్ చేసిన జడ్డూ.. ‘ప్రాసెస్ ఏంటి?’ అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీని జోడించాడు. దీంతో ఆ పోస్టుకు రవీంద్ర జడేజా ఏమైనా అప్లై చేసుకుంటాడా?పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం అగార్కర్‌ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ రవీంద్ర జడేజాను కొన్ని వన్డే సిరీస్‌లకు పక్కన పెట్టింది. అప్పుడు వీరిద్దరి మధ్య సంబంధాలు చెడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జడేజా తాజా పోస్ట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.