ముగిసిన అజిత్ అగార్కర్ పదవి కాలం..

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీతో అగార్కర్ పదవీకాలం ముగిసింది. వెంటనే ఖాళీగా ఉన్న సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా రాబోయే సెలక్టర్‌ని బట్టి తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎంపిక ఉండబోతోంది. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆసక్తికర పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బీసీసీఐ దరఖాస్తుల నోటిఫికేషన్‌కు సంబందించిన పోస్టును షేర్ చేసిన జడ్డూ.. ‘ప్రాసెస్ ఏంటి?’ అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీని జోడించాడు. దీంతో ఆ పోస్టుకు...