Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాధ్యతలే ప్రగతి బాటలు

    Author VENKATESH | 06 Oct 2026, 08:31 PM | కరీంనగర్
    బాధ్యతలే ప్రగతి బాటలు

    తల్లి తండ్రుల పెంపకం
    పైననే పిల్లల వ్యక్తిత్వ వికాసం
    భావోద్వేగాలు ఆలోచనలు
    కుటుంబం సమాజం
    ఆత్మీయత బంధాలు
    అనుబంధాలు
    రూపుదిద్దుకుంటాయి
    చిన్న నాటి ధైర్య సాహసాలే
    వారి భావి జీవితానికి బాటలు
    వేస్తాయి చిన్న నాటి బాధ్యతలే
    చిన్నారుల భవిష్యత్తుకు
    పునాదులు వేస్తాయి
    షేరింగ్ కేరింగ్ కు బీజాలు
    నాటుతాయి అందుకే
    మొక్కై వంగనిది మానై
    వంగునా అంటారు పెద్దలు
    బాధ్యత తెలిసిన చోటే
    ఆత్మవిశ్వాసం మొలకెత్తుతుంది
    చిన్ని చేతులకు పనులు నేర్పితే
    భవిష్యత్తుపై ధీమా పెరుగుతుంది
    తాము కూడా ఇతరులకు
    ఉపయోగపడగలమని
    గ్రహించినప్పుడే పిల్లలో
    ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
    కాబట్టి వారికి సహాయం చేసే
    అవకాశం తల్లి తండ్రులు ఇవ్వాలి
    తమ పనులు తాము చేసుకుంటూ
    ఇంటి పనుల్లో తోడుగా ఉండేట్లు
    చిన్న చిన్నబాధ్యతలను వారిపై
    ఉంచండి దీని వల్ల తాము ఇంట్లో
    సమాజంలో ఎంతో విలువైన వారమనే భావన ద్వారా లభించే
    ఆత్మవిశ్వాసానికి వారిని
    దూరం చేయకండి
    దీనివల్ల పిల్లల్లో సంకల్ప శక్తి జనించి పనిసంస్కృతి పట్ల
    ఇష్టం పెరుగుతుంది
    పని ప్రగతి పురోగతి మధ్య
    ఉన్న సమన్వయ శీలత పెరిగి
    వారిలో కార్యాచరణ ధోరణి
    బలపడుతుంది
    అమ్మకు కాస్త సాయం చేస్తూ
    నాన్నకు చిన్న పనులు చూస్తూ
    తమ పనులు తామే చేసుకుంటూ
    పిల్లలు ఎదగాలి నవ్వుతూ
    క్రమశిక్షణ అనే నీరు పోసి
    బాధ్యత అనే ఎరువు వేస్తే
    నేటి చిరు మొక్కలే రేపటి రోజున
    మహా వృక్షాలై సమాజానికి
    నీడ నిస్తాయి
    ఎవరో వస్తారని ఎదురుచూడక
    మన.బాధ్యత మనమే పాటిద్దాం
    స్వామి వివేకానంద చెప్పినట్లు
    నీ విధిని నువ్వే నిర్మించుకో
    అంటూ అడుగులు ముందుకు
    వేసేలా చేద్దాం
    కృషి ఉంటే మనుషులు
    ఋషులౌతారు అన్నట్లు
    చిన్న నాటి బాధ్యతలే
    రేపటి గొప్ప విజయాలకు
    పునాదులు
    ఆత్మవిశ్వాసంతో సాగితేనే
    పిల్లలు అవుతారు రేపటి
    ఉత్తమ పౌరులు
    చిన్నప్పుడే నేర్పిన మంచి నడవదు
    జీవితాంతం తోడుండే పెద్ద బడి
    ఆత్మవిశ్వాసంతో అడుగులువేస్తూ
    పిల్లలు సాధిస్తారు విజయాలు
    పిల్లలకు కేవలం ఆస్తులు
    ఇవ్వడం కాదు బాధ్యతలను
    నేర్పడమే మనం ఇచ్చే
    నిజమైన ఆస్తి ఆత్మవిశ్వాసమే
    ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్టు
    పిల్లల ప్రాథమిక విద్యలో
    తల్లితండ్రులు ఉపాధ్యాయులే
    వారి ప్రవర్తనను బాధ్యతలను
    తీర్చిదిద్దుతారు.ఈ మాటలను
    స్పూర్తిగా తీసుకొని
    పిల్లలను బాధ్యతాయుత
    మార్గంలో నడిపిద్దాం
    పిల్లల ప్రతిభా పరివ్యాప్తితో
    వికసిత భారత్ నిర్మిద్దాం.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎడ్యుకేషన్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771