బాధ్యతలే ప్రగతి బాటలు

తల్లి తండ్రుల పెంపకం పైననే పిల్లల వ్యక్తిత్వ వికాసం భావోద్వేగాలు ఆలోచనలు కుటుంబం సమాజం ఆత్మీయత బంధాలు అనుబంధాలు రూపుదిద్దుకుంటాయి చిన్న నాటి ధైర్య సాహసాలే వారి భావి జీవితానికి బాటలు వేస్తాయి చిన్న నాటి బాధ్యతలే చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి షేరింగ్ కేరింగ్ కు బీజాలు నాటుతాయి అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అంటారు పెద్దలు బాధ్యత తెలిసిన చోటే ఆత్మవిశ్వాసం మొలకెత్తుతుంది చిన్ని చేతులకు పనులు నేర్పితే భవిష్యత్తుపై ధీమా పెరుగుతుంది తాము కూడా ఇతరులకు ఉపయోగపడగలమని గ్రహించినప్పుడే పిల్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి వారికి సహాయం చేసే అవకాశం తల్లి తండ్రులు ఇవ్వాలి తమ పనులు తాము చేసుకుంటూ...