Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ పట్టణంలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాల బైక్ ర్యాలీ

    Author VENKATESH | 03 Oct 2026, 02:39 PM | నల్గొండ
    దేవరకొండ పట్టణంలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాల బైక్ ర్యాలీ

    దేవరకొండ,03అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    దేవరకొండ పట్టణంలో వన్యప్రాణి వారోత్సవాల లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవులు మరియు వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ర్యాలీ చేపట్టారు.
    ​ఈ కార్యక్రమంలో ఇంచార్జి రేంజ్ ఆఫీసర్ సయ్యద్ ఇజాజ్ అహ్మద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు మరియు ఇతర అటవీ శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
    ​ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ సయ్యద్ ఇజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. "అడవులను కాపాడుకోవడం ద్వారానే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుంది, ఇది మానవ మనుగడకు ఎంతగానో సహాయపడుతుంది. మనం పర్యావరణాన్ని ఎంత కాపాడుకుంటామో, మానవాళిని అంతగా రక్షించుకున్నవారమవుతాం" అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.