దేవరకొండ పట్టణంలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాల బైక్ ర్యాలీ

దేవరకొండ,03అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణంలో వన్యప్రాణి వారోత్సవాల లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవులు మరియు వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ర్యాలీ చేపట్టారు. ​ఈ కార్యక్రమంలో ఇంచార్జి రేంజ్ ఆఫీసర్ సయ్యద్ ఇజాజ్ అహ్మద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు మరియు ఇతర అటవీ శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ సయ్యద్ ఇజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. "అడవులను కాపాడుకోవడం ద్వారానే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుంది, ఇది మానవ మనుగడకు ఎంతగానో సహాయపడుతుంది. మనం పర్యావరణాన్ని ఎంత కాపాడుకుంటామో,...