Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బడంగ్‌పేట్‌లో అక్టోబర్ 9న 'రాజ్యాధికార సమరభేరి' సభ

    Author VENKATESH | 02 Oct 2026, 09:21 PM | నల్గొండ
    బడంగ్‌పేట్‌లో అక్టోబర్ 9న 'రాజ్యాధికార సమరభేరి' సభ

    భారీగా తరలిరావాలని బిఎస్పి నాయకుల పిలుపు
    - పడమటిపల్లిలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ నేతలు
    దేవరకొండ,02 అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    దేవరకొండ మండలం పడమటి పల్లి గ్రామంలో బిఎస్పి పార్టీ కార్యాచరణ పోస్టర్ ఆవిషరించిన పార్టీ నాయకులు.మాన్యశ్రీ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న బడంగ్‌పేట్‌లో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి”భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను దేవరకొండ మండలం పడమటిపల్లిలో నియోజకవర్గ ఇంచార్జి రాజేష్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ పార్లమెంట్ ఇంచార్జి నల్ల ప్రసాద్,దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జి గాలి ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నల్ల ప్రసాద్ సమక్షంలో పలువురు నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా నల్ల ప్రసాద్ గారు మాట్లాడుతూ,తెలంగాణ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ అన్న నాయకత్వంలో బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం,సమానత్వం మరియు రాజ్యాధికార సాధన కోసం బహుజనులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాన్యశ్రీ కాన్షిరాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.బహుజన సమాజం రాజకీయంగా,సామాజికంగా మరింత ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.అక్టోబర్ 9న నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభకు బహుజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.