Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనసన్మానం

    Author VENKATESH | 28 Sep 2026, 10:45 AM | ములుగు
    ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనసన్మానం

    * విద్యార్థిని విద్యార్థులను సన్మానించిన హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్, జక్కమహబూబ్ రెడ్డి.
    ములుగు జిల్లా ప్రతినిధి,
    సెప్టెంబర్ 27 (బి వి కె న్యూస్):
    హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా తొర్రూర్ డివిజన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా స్థానిక మున్సిపల్ కేంద్రం గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీటీసీ జక్క మహబూబ్ రెడ్డి
    సతీమణి ప్రతిభా దంపతులు, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ తో కలిసి ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జక్క మహబూబ్ రెడ్డి మంగళపల్లి హుస్సేన్ లు మాట్లాడుతూ.. మేఘన కొమ్ము ప్రకాష్, హర్షిత రాథోడ్, నితిన్ విద్యార్థిని విద్యార్థులు ఎంబిబిఎస్ సీట్లు సాధించడం మన తొర్రూర్ డివిజన్ కు, మహబూబాబాద్ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం హర్షనీయమని వారిని అభినందించారు. మరియు
    హార్దిక సహాయాన్ని అందించారు.
    ఈ కార్యక్రమంలో వివిధ గ్రామల సర్పంచులు, నాయకులు, కుల సంఘాలు రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం లాలయ్య, పాలకుర్తి నియోజకవర్గం గిద్దె లక్ష్మణ్, నగర కంటి వెంకన్న, కిరణ్, అశోక్, మహేష్, దేవేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.