Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒకే దేశం ఒకే ఎన్నిక దేశ ప్రగతికి వరం

    Author VENKATESH | 26 Sep 2026, 07:57 PM | కరీంనగర్
    ఒకే దేశం ఒకే ఎన్నిక దేశ ప్రగతికి వరం

    ఒకే దేశం ఒకే ఎన్నిక
    దేశ ప్రగతికి వరం
    ఎన్నికల ప్రక్రియ సులభమై
    పరిపాలనా భద్రతాపరమైన
    సవాళ్ళు తగ్గుతాయి
    ఎన్నికల ఖర్చు తగ్గి పాలన
    మెరుగుపడిప్రగతి పురోగతి
    జరిగి ఆర్థిక వ్యవస్థలో
    1.5 % జిడిపిలో వృద్ది
    జరిగి శీఘ్రతర ఆర్థికాభివృద్ధితో
    ప్రజల జీవన ప్రమాణాలు
    పెరిగిదేశం ప్రపంచంలో
    3వ ఆర్థిక శక్తిగా ఎధుగవచ్చు
    జమిలిఎన్నికలతోవోటింగ్
    శాతం పెరిగి ప్రజాస్వామ్య
    వ్యవస్థ బలోపేతమై పాలనలో
    ప్రజాభాగస్వామ్యం పెరిగి
    గణతంత్ర వ్యవస్థ పని తీరు
    మెరుగు పడుతుంది
    రాజ్యాంగం ప్రసాధించిన
    గొప్ప ఆయుధం వోటు హక్కు
    జాతి తల రాతను మార్చేది
    ఎన్నికలే ప్రజల స్థితిని గతిని
    మార్చి జాతికి ఉజ్వల భవిష్యత్తు
    అందించేది ఓటు హక్కే
    దేశంలోని అసెంబ్లీలకు లోకసభకు
    ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు
    129వరాజ్యాంగ సవరణ బిల్లుకు
    పార్లమెంట్ ఆమోద ముద్ర
    వేయడం మెరుగైన రాజకీయాలకు
    మేలి మలుపు
    రాజకీయ పార్టీలకు మేలు కొలుపు
    వికసిత్ భారత్ కు ఆయువు పట్టు
    ఏకం కాలంలో ఎన్నికలు
    జాతీయ ప్రజాభిప్రాయ
    సాధనకు ఆయుధం
    ఓటర్లు జాతీయ సమస్యల
    పరిష్కార సత్తావున్న
    సమర్థఉత్తమప్రజా
    ప్రతినిధులను ఎన్నుకుంటారు
    ప్రజా ఆకాంక్షలుతీర్చే అభివృధ్ధికర
    రాజకీయ పార్టీకి పట్టం కట్టే
    ప్రజాస్వామ్య ప్రక్రియకు
    దశ దిశ కావాలి
    జమిలి ఎన్నికలతో సమయం
    ఆదా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది
    తరుచుగా జరిగే ఎన్నికలతో
    ఎన్నికల కోడుఅభివృద్ధికి
    అడ్డంకిగా మారి అభివృధ్ది
    మందగిస్తుంది
    ఏకం కాలంలో ఎన్నికలు దేశంలో
    ఐక్యత చైతన్యం సమైక్యత
    సమగ్రత పరిఢవిల్లి దేశ ప్రగతి
    పరుగెడుతుంది
    జమిలి ఎన్నికలతోరాజకీయ
    పార్టీలుఓటర్లను కులం మతం
    ప్రాంతం ఉచితాల పేరు
    మీధ విభజించే కుళ్ళు
    కుతంత్రాలుకలుషిత
    రాజకీయాలు నేరమయ
    రాజకీయాలు రాజకీయ
    కుమ్ములాటలు ఓట్ల కొనుగోలు
    రాజకీయ హింస ఓటర్లను
    ప్రలోభాల వలలో పడకుండా
    జరిగే సామాజిక నష్టాన్ని
    అరికట్టవచ్చు


    ఒకవ్యక్తి ఓకే స్థానంలో
    పోటీ చేసేట్లు సంస్కరణలు
    తేవాలి రెండు చోట్లఎన్నికైన
    అభ్యర్థి రాజీనామా చేస్తే
    ఎన్నికల ఖర్చును ఆవ్యక్తి
    లేదా పార్టీ భరించాలి
    పార్టీ ఫిరాయింపులనిషేథచట్టాన్ని
    కఠినంగా అమలు చేయాలి
    జమిలి ఎన్నికలతో
    సుస్థిర రాజకీయాలుఏర్పడి
    జాతిసమైక్యత సమగ్రత
    బలోపేతమైభారత ఖ్యాతి
    విశ్వజనీన మౌతుంది
    ప్రజల చేతుల్లో
    సార్వభౌమాధికారం
    సుస్థిర మౌతుంది
    ప్రజల సాంఘిక ఆర్థిక
    సామాజిక మార్పులు
    జరిగి పేదల ముంగిట్లోకి
    సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం సమన్యాయం సిద్ధిస్తుంది
    ఒకే దేశం ఒకే ఎన్నిక
    ఒకే రాజ్యాంగం ఒకే ధర్మం
    ఒకే చట్టం ఒకే న్యాయం
    భిన్నత్వంలో ఏకత్వం
    జాతి ఐక్యత సమైక్యత
    సాధ్యమౌతుంది
    ఒకే సారి జరిగే ఎన్నికలు
    సామాన్యుని కలల
    సాకారానికి సాధికారితకు
    రాచబాట
    జమిలి ఎన్నికలుజాతీయ
    ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న
    తరుణంలో ప్రాంతీయ సమస్యల
    పరిష్కారాన్నినిర్లక్ష్యం చేయద్దు
    సమాఖ్య స్ఫూర్తి చాటుతూనే
    సంతులిత సుస్థిరాభివృధ్ధికి
    నిర్దిష్ట కాలంలో నిర్ణయించిన
    కార్యాచరణతో‌అభివృద్ధి
    ప్రణాళికల అమలుకు
    పూనుకోవాలి
    జమిలి ఎన్నికలుగేమ్ చెంజర్
    అన్నభారత మాజీ రాష్ట్రపతి
    రాంనాథ్ కోవింధ్ వాఖ్య నవ
    రాజకీయాలకు నాంది కావాలి.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్ 9440245771