Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మల్లూరు హేమాచల క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా ఆలయ అభివృద్ధి

    Author VENKATESH | 24 Sep 2026, 09:11 PM | ములుగు
    మల్లూరు హేమాచల క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా  ఆలయ అభివృద్ధి

    ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
    ఆలయ విశిష్టత పురాణ
    నేపథ్యం స్వామి వారి గొప్పతనం
    భక్తులకు తెలియజేసేలా మాస్టర్
    ప్లాన్ - మంత్రి సీతక్క.
    ములుగు జిల్లా ప్రతినిధి,
    సెప్టెంబర్ 24 (బి వి కె న్యూస్):
    మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లోని సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షిస్తూ, క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    అనంతరం ఆలయ అభివృద్ధి కి, మాస్టర్ ప్లాన్ చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి పనులతో ఎవరికీ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మల్లూరు క్షేత్రంలోని దట్టమైన అడవులు, వందల ఏళ్ల నాటి వృక్షాలు, స్వచ్ఛమైన గాలి, సహజ జలవనరులతో కూడిన ఆహ్లాదకర వాతావరణం ఎంతో అరుదైనదని పేర్కొన్నారు.
    ఇటువంటి ప్రకృతి సంపదను కొత్తగా నిర్మించలేమని, ఎంత ఖర్చు చేసినా కొనుగోలు చేయలేమని తెలిపారు. ఆలయ పరిసరాల్లోని సహజత్వానికి ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
    భక్తుల అవసరాలు, భవిష్యత్తులో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుధ్యం, విశ్రాంతి ప్రదేశాలు, వాహనాల నిలుపుదల, రాకపోకలకు అనువైన మార్గాలు వంటి సౌకర్యాలకు మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం చేస్తున్నట్లు తెలిపారు.
    ఆలయ చరిత్ర, పురాణ నేపథ్యం, స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేసేలా ఆకర్షణీయమైన శిల్పాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
    క్షేత్ర గొప్పతనం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడే లా మాస్టర్ ప్లాన్‌ను అద్భుతంగా ఆవిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
    రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ మండపం విస్తరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భక్తుల సౌకర్యార్థం వసతి గదులు, కళ్యాణ మండపం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
    అంతకుముందు ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న గోశాలకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
    కార్యక్రమంలో జిల్లా ఐటీబీ శాఖ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, ఆలయ ఈఓ వీరస్వామి, తహసిల్దార్ తోట రవీందర్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.