మల్లూరు హేమాచల క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా ఆలయ అభివృద్ధి
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఆలయ విశిష్టత పురాణ నేపథ్యం స్వామి వారి గొప్పతనం భక్తులకు తెలియజేసేలా మాస్టర్ ప్లాన్ - మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 24 (బి వి కె న్యూస్): మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లోని సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షిస్తూ, క్షేత్ర విశిష్టత ప్రతిబింబించేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు....