Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వికసిత భారత్ సృష్టికర్తలు

    Author VENKATESH | 23 Sep 2026, 03:14 PM | కరీంనగర్
    వికసిత భారత్  సృష్టికర్తలు

    స్వార్థపు సంకెళ్లు తెంచుకుంటూ
    సమసమాజ స్థాపన శ్వాసగా
    సేవయే లక్ష్యంగా చైతన్యమే
    ధ్యేయంగా మార్పుయే బాటగా
    కదిలింది విద్యార్థి యువ దళం
    ఎన్ ఎస్ ఎస్ సేవా దళం
    నా కోసం కాదు నీకోసం అంటూ
    సాగే ప్రతి అడుగు ఒక ప్రగతి
    పరుల కోసమే తపించే హృదయం
    నిజమైన మానవత్వానికి ప్రతీక
    ఎండిపోతున్న పచ్చదనాన్ని
    కాపాడగా పర్యావరణ
    రక్షకులుగా మారుతాం
    ప్రకృతి కన్నెర్ర చేసి
    వైపరీత్యం సృష్టిస్తే భయం
    వీడి ఆపద్బాంధవులపై
    నిలుస్తాం
    ఆపదలో ఉన్న ప్రాణాన్ని
    నిలబెట్టెందుకు లక్షలాది
    మందికి పునర్జన్మ నిచ్చేందుకు
    రక్తదాతలమై ముందుకు
    కదులుతాం మానవత్వం
    విలువను చాటి చెబుతాం
    అపోహల చీకట్లను
    చేదిస్తూ అత్యవసర వేళల్లో
    ఆశ్రయంమవుతూ మానవ
    శరీరంలో ప్రవహించే రక్తం
    బొట్టును సమాజసేవకై పవిత్ర
    కానుకగా సమర్పిస్తాం
    వ్యసనాల చీకటిలో మునిగే
    లోకాన్ని వ్యసన ముక్త
    వెలుగులతో నడిపిస్తాం
    ఈరథ చక్రపు 24 ఆకులు
    చెబుతున్నాయి నిరంతర
    సేవా సందేశం
    సగర్వ వికసిత భారత
    నిర్మాణంలో మేమే
    నవయుగ శిల్పులం
    దేశ రక్షకులం
    ఓ యువకుడా ఓ యువతీ
    స్వార్థం వీడి సమాజ
    శ్రేయస్సుకు కదిలిరండి
    సేవా పత్రాన్ని చేతబూని
    నవ చరిత్రను రాయండి
    నేదునూరి కనకయ్య
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    (ఇందిరాగాంధీ నేషనల్
    ఎన్ 'ఎస్ 'ఎస్ బెస్ట్
    యూనిట్ అవార్డ్ గ్రహీత)
    అధ్యక్షులు
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    రచయిత' కాలమిస్ట్
    కరీంనగర్
    9440245771