Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేటి సమాజానికి నైతిక దీపాలు

    Author VENKATESH | 19 Sep 2026, 07:58 PM | కరీంనగర్
    నేటి సమాజానికి నైతిక దీపాలు

    (సెప్టెంబర్13 నుండి 20తేదీ
    వరకు జాతీయ తాతా బామ్మల
    (గ్రాండ్ పేరెంట్స్ వీక్)
    వారోత్సవాల సందర్భంగా)
    ఉరుకుల పరుగుల నేటి జగత్తులో
    పచ్చని నీడలు తాతయ్యలు
    ఆధునిక కాలపు అల్లరి ముందర
    ఆదర్శమూర్తులు అమ్మమ్మలు
    నానమ్మలు
    సెల్ ఫోన్ లోనే లోకం చూసే
    పిల్లల చేతిని తాకాలి
    కనుమరుగవుతున్న కథలను
    చెప్పి కమ్మని విలువలు నేర్పాలి
    తాతలు (బామ్మలు) అమ్మమ్మ
    నానమ్మలు చెప్పే కథలు
    మనుమలకు మనుమరాళ్లకు
    రేపటి జీవిత పాఠాలు
    నీతి కథలు రేపటి తరానికి
    వ్యక్తిత్వ వికాస పాఠాలుగా
    మారిపోతాయి
    అమ్మ నాన్నలు ఉద్యోగాలలో
    అలిసి సొలసి ఇల్లు చేరితే
    పిల్లల బాధ్యత భుజానవేసి
    భరోసా ఇచ్చే తోడవ్వాలి
    నేను నిన్ను ఎన్నటికీ మరువను
    అంటూ పెద్దల ప్రేమే మనకు
    రక్షణ కావాలి
    పాతకాలపు అనుభవాలే
    కొత్తతరానికి ఆస్తిగా పంచాలి
    కోపాలు తగ్గించి స్నేహం పెంచి
    మనుమల మనుమరాళ్ల
    మనుషులు గెలవాలి
    పాతకాలపు అనుభవాలే
    కొత్త తరానికి పంచాలి
    బడి నేర్పుని ఎన్నో పాఠాలు
    ఒడిలోనే సులువుగా చెప్పాలి
    నేటి సమాజపు మార్పులు
    గమనిస్తూ నైతిక రక్షణగా
    నిలవాలి
    తాత బామ్మలు అత్యుత్తమ
    గుణాలు నైతికత మానమీయ
    విలువలను ప్రేమగా అవలీలగా
    ఉచితంగా ఆసక్తికరంగా నేర్పే
    మేధావులని గుర్తించుకోవాలి
    గ్రాండ్ పేరెంట్స్ అంటే కేవలం
    వృద్దులు కాదు. వారు మన
    సంస్కృతికి వారథులు .
    2026 అంతర్జాతీయ థీమ్
    వృద్ధాప్యంలో ఓరి ఒంటరిగా
    వదిలేయకుండా మిమ్మల్ని
    ఎన్నటికీ మరువము అనే
    నమ్మకాన్ని మనం ఇవ్వాలి.
    నేటి సమాజంలో
    తల్లిదండ్రులు బిజీగా
    ఉన్నప్పుడు పిల్లలను పెంచే
    బాధ్యతలో భాగస్వాములు
    అవుతూనే వారికి డిజిటల్
    ప్రపంచంలో డిప్రెషన్ కు
    లోను కాకుండా మానసిక
    స్థిరత్వం అందించే గొప్ప శక్తి
    కేవలం తాతయ్య అమ్మమ్మలకే
    నానమ్మలకే ఉంది.
    తాత బామ్మలను గుండెల్లో
    పెట్టుకొని చూసుకోవాలి
    పెద్దలను గౌరవిస్తూ వారి
    మార్గదర్శకత్వం లో పిల్లలను
    పెంచినప్పుడు సమాజం
    ఆరోగ్యకరంగా ఉంటుందనే
    సత్యాన్ని సమాజం గుర్తించాలి.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్
    9440245771