Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవితం ?

    Author VENKATESH | 17 Sep 2026, 01:07 PM | కరీంనగర్
    జీవితం ?

    జీవితం అంటే ఇతరుల
    కోసం జీవించడమే
    _స్వామి వివేకానంద _
    జీవితం అంటే అనుభవాల
    సమాహారం సుఖ దుఃఖాల
    కలయిక నిరంతరం సాగే
    ప్రయాణం
    ఆదరణలు అవమానాలు
    ఉత్థాన పతనాలు
    అవహేళనలు అభినందనలు
    జీవితం అంటే శ్వాసించడం
    కాదు ప్రతిక్షణాన్ని మనస్పూర్తిగా
    ఆస్వాదించడం ఓపికతో
    భరించడం అనుభవించడం
    పాఠాలు గుణపాఠాలు
    నేర్చుకోవడం ప్రవర్తన
    మార్చుకోవడం మారిపోవడం
    నిన్నటి గాయాలను దాటుకుంటూ
    రేపటి గమ్యం వైపు అడుగులు
    వేయడం కుంగుబాటుతో
    కుదేలు కాకుండా చైతన్య
    స్రవంతిగా ముందుకు సాగడం
    చీకట్లను పారదోలి వెలుతురు
    వైపు దిక్సూచిగా నిలవడం
    జీవితం అంటే ఇతరుల
    హృదయాలను గెలవడం
    చెడు విషయాలను వదలడం
    సంతోషాలను పంచుకోవడం
    ఆత్మీయత అభిమానం
    ఆర్థత పెంచుకోవడం
    బాధలను పంచుకోవడం
    బాధ్యతగా ప్రవర్తించడం‌
    సానుకూలంగా స్పందించడం
    పడిపోయిన ప్రతి సారి నూతన
    బలంతో విజృంభించడం
    ఆకాశమంత ఎత్తుకు
    ఎదగాలనే సంకల్పం
    జీవితం అంటే కష్టాల కడలిలో
    కొట్టుమిట్టాడే పడవ కాదు
    తుపానును ఎదురించి సాగే
    ధైర్య నౌక
    జీవితం ఒక చదరంగం ఆట
    ఆటలో గెలుపు ఓటములను
    సమానంగా స్వీకరించాలి
    ఓటమిని కూడా గెలుపుగా
    మార్చే వ్యూహమే జీవన తరంగం
    ఆపథలో అండగా నిలవడం
    ప్రేమను పంచుతూ ఆత్మీయతను
    పెంచుతూ సృష్టిలో ఒక మంచి
    జ్ఞాపకంగా మిగిలడమే జీవితం
    మనుషులందరూ సమానమే
    ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి
    కానీ హాని చేసుకోకూడదు
    దోచుకోకూడదు బతుకు బతికించు
    అన్న భావన ప్రతి ఒక్కరిలో
    ఉన్నపుడే జీవిత సార్ధకత
    సిద్ధిస్తుంది
    మనిషిగా మానవీయతను ఛాటడం ఆపన్నులను ఆదుకోవడం పరోపకారం
    జనహితమే అభిమతంగా
    సాగే జీవితమే ధన్యం.
    జీవితం అంటే బతకడమే కాదు
    ఇతరులను బతికేట్లు చేయడం
    బతుకు బతికించు జీవితాన్ని
    జయించు ప్రగతి పురోగతికి
    మార్గదర్శివై స్పూర్తిదాతవై
    నవ చరిత్రను నిర్మించాలి.
    నేదునూరి కనకయ్య
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771