జీవితం ?
జీవితం అంటే ఇతరుల కోసం జీవించడమే _స్వామి వివేకానంద _ జీవితం అంటే అనుభవాల సమాహారం సుఖ దుఃఖాల కలయిక నిరంతరం సాగే ప్రయాణం ఆదరణలు అవమానాలు ఉత్థాన పతనాలు అవహేళనలు అభినందనలు జీవితం అంటే శ్వాసించడం కాదు ప్రతిక్షణాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించడం ఓపికతో భరించడం అనుభవించడం పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవడం ప్రవర్తన మార్చుకోవడం మారిపోవడం నిన్నటి గాయాలను దాటుకుంటూ రేపటి గమ్యం వైపు అడుగులు వేయడం కుంగుబాటుతో కుదేలు కాకుండా చైతన్య స్రవంతిగా ముందుకు సాగడం చీకట్లను పారదోలి వెలుతురు వైపు దిక్సూచిగా నిలవడం జీవితం అంటే ఇతరుల హృదయాలను గెలవడం చెడు విషయాలను వదలడం సంతోషాలను పంచుకోవడం ఆత్మీయత అభిమానం ఆర్థత పెంచుకోవడం...