Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రగతి బాటలో ప్రజాస్వామ్యం

    Author VENKATESH | 16 Sep 2026, 01:52 PM | కరీంనగర్
    ప్రగతి బాటలో ప్రజాస్వామ్యం

    (సెప్టెంబర్ 17వ తేదీన
    (1948 సెప్టెంబర్ 17)
    78 వ తెలంగాణ విమోచన దినోత్సవం ( ఆపరేషన్ పోలో)
    (హైదరాబాద్ సంస్థాన
    విముక్తి దినోత్సవం)
    సందర్భంగా)
    తెలంగాణ నేలతల్లి స్వేచ్ఛా
    గీతం విన్న రోజిది
    కోటి రత్నాల వీణా పరిది
    దాటి పాడిన రోజిది
    నిజాం కోరల నుండి భారతదేశ
    ఐక్యతా నినాదమై బానిసబంధాలు
    తెంచుకున్న జెండా ఎగిరిన రోజిది

    ఆనాడు సాగింది ప్రజల
    సాయుధ పోరాటం
    రజాకార్ల గుండెల్లో
    పుట్టింది వణుకు
    చాకలి ఐలమ్మ వీరత్వం
    కొమరం భీమ్ గర్జన
    తెలంగాణ బిడ్డల రక్తం
    రాసింది ఈరంగుల చరిత్ర
    ఓ యువతా
    నేటి నీబాధ్యతను
    మరవకు ఆనాటి త్యాగాల
    వెలుగును నువ్వు వీడకు
    లంచాల సంకెళ్లను తెంచే
    సైనికుడివి కావాలి
    అభివృద్ధికి సారథివి కావాలి
    అన్యాయాన్ని అక్రమాలను
    అరికట్టే శక్తివి కావాల
    పేదల బతుకుల్లో చీకట్లను
    చీల్చే సూర్యుడివి కావాలి
    సమసమాజ స్థాపన
    నీ ఆశయం కావాలి
    బంగారు తెలంగాణ వైపు
    నీఅడుగులు పడాలి
    నాటి పోరాటం స్పూర్తిగా
    స్వేచ్ఛా రక్షణ కోసం
    సాగాలి ముందుకు
    నీ పోరాటం సాగాలి పేదల
    సంక్షేమం కోసం ప్రగతి కోసం!
    ప్రభుత్వ పాలనలో పారదర్శకత
    జవాబుదారీతనం పెరగాలి
    ప్రతి ఇంటికి అందాలి స్వేచ్ఛా
    ఫలాలు సమాన అవకాశాలు
    అధికార కేంద్రీకరణతో పాలనలో
    ప్రజా భాగస్వామ్యం పెరగాలి
    అధికారం అంటే కేవలం
    కుర్చీల ఆట కాదు
    పేదరిక నిర్మూలనే ప్రభుత్వ
    పాలన ధ్యేయం కావాలి
    ప్రజలారా ప్రశ్నించే హక్కును
    వాడండి ప్రగతిని భుజాన
    వేసుకోండి అభివృద్ధికి శక్తిగా
    నిలవండి అన్యాయాన్ని
    సమిస్టిగా ఎదుర్కోవాలి
    అమరుల ఆశయాల సాధనకు
    రాజకీయ పార్టీలు కృషి చేయాలి
    ద్వేషాలు పక్కన బెట్టి
    అభివృద్ధికై పోటీ పడి బంగారు
    తెలంగాణ నిర్మాణానికి
    పునరంకి తమ కావాలి
    త్యాగధనుల స్ఫూర్తితో
    కొత్త తెలంగాణనను నిర్మిద్దాం
    సామాజిక తెలంగాణ సాధన
    దిశగా అడుగులు వేద్దాం
    బడుగు బలహీన వర్గాల
    సంక్షేమం కోసం తాడిత
    పీడిత జన సామాజిక ఆర్థిక
    వికాసానికి కృషి చేస్తూ
    ప్రగతి బాటలో పయనిద్దాం
    సర్దార్ పటేల్ చూపిన
    ధృఢ సంకల్పంతో
    కొమరం భీమ్ గర్జించిన
    ఆత్మ గౌరవంతో
    కాళోజీ ప్రబోధించిన
    సామాజిక బాధ్యతతో
    భవిష్యత్తు కార్యాచరణకు
    కర దీపికగా మారుదాం
    మహాకవి దాశరథి కృష్ణమా
    చార్య కలల సాకారానికి
    ఎలుగెత్తి నినదిస్తూ
    నా తెలంగాణ కోటి రత్నాల
    వీణ అంటూ తెలంగాణను
    ప్రజాస్వామ్య సామాజిక ప్రగతి
    శీల ప్రాంతంగా అభివృద్ధి చేద్ధాం
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771