ప్రగతి బాటలో ప్రజాస్వామ్యం

(సెప్టెంబర్ 17వ తేదీన (1948 సెప్టెంబర్ 17) 78 వ తెలంగాణ విమోచన దినోత్సవం ( ఆపరేషన్ పోలో) (హైదరాబాద్ సంస్థాన విముక్తి దినోత్సవం) సందర్భంగా) తెలంగాణ నేలతల్లి స్వేచ్ఛా గీతం విన్న రోజిది కోటి రత్నాల వీణా పరిది దాటి పాడిన రోజిది నిజాం కోరల నుండి భారతదేశ ఐక్యతా నినాదమై బానిసబంధాలు తెంచుకున్న జెండా ఎగిరిన రోజిది ఆనాడు సాగింది ప్రజల సాయుధ పోరాటం రజాకార్ల గుండెల్లో పుట్టింది వణుకు చాకలి ఐలమ్మ వీరత్వం కొమరం భీమ్ గర్జన తెలంగాణ బిడ్డల రక్తం రాసింది ఈరంగుల చరిత్ర ఓ యువతా నేటి నీబాధ్యతను మరవకు ఆనాటి త్యాగాల వెలుగును నువ్వు వీడకు లంచాల...