Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సిటీ డెవల‌ప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి

    Author VENKATESH | 12 Sep 2026, 01:34 PM | TELANGANA
    హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సిటీ డెవల‌ప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయండి

    హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సిటీ డెవల‌ప్‌మెంట్‌పై సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై గత ముఖ్యమంత్రిని కోరిన ఆయన సమావేశం పెట్టలేదని పెదవి విరిచారు.హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు చేస్తున్నారని.. కానీ మంచి డెవలప్‌మెంట్ కావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మూడు కార్పొరేషన్లపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు పూర్తయిందని.. ఇంకా 15 నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ఈ 15 నెలల్లో మూసీ డెవలప్‌మెంట్ అవుతుందా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఈ వర్క్ నిదానంగా జరుగుతుందని అన్నారు. నగరంలో దోమల బెడద విపరీతంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.20 శాతం ప్రాపర్టీ టాక్స్ పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందో? లేదో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. గతంలో ఓ ఎమ్మెల్యే మీడియా ముందే అధికారులు విలువ ఇవ్వడం లేదని చెప్పారని గుర్తు చేశారు. అధికారులను రిక్వెస్ట్ చేసినా స్పందించడం లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ వాపోయారు. పని చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.