హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సిటీ డెవలప్మెంట్పై సమావేశం ఏర్పాటు చేయండి
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సిటీ డెవలప్మెంట్పై సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై గత ముఖ్యమంత్రిని కోరిన ఆయన సమావేశం పెట్టలేదని పెదవి విరిచారు.హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు చేస్తున్నారని.. కానీ మంచి డెవలప్మెంట్ కావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మూడు కార్పొరేషన్లపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు పూర్తయిందని.. ఇంకా 15 నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ఈ 15 నెలల్లో మూసీ డెవలప్మెంట్ అవుతుందా..?...