Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పలువురు సంఘ నేతలు మృతుని కుటుంబాన్ని పరామర్శ

    Author VENKATESH | 10 Sep 2026, 02:08 PM | TELANGANA
    పలువురు సంఘ నేతలు మృతుని కుటుంబాన్ని పరామర్శ

    గ్రామం ఇప్పలపల్లిలో గత నాలుగు రోజుల క్రితం చనిపోయిన కీర్తిశేషులు దూడపాక ( రేడియో) కొమురయ్య అనారోగ్యంతో అకాల మరణం పొందాడు తద్వారా... విషయం తెలుసుకున్న పలువురు నేతలు వారికున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
    నాటి గురువు కళాకోట్ల కుమారస్వామి మమునూర్ గ్రామం నుండి వచ్చి మృతిని కుటుంబాన్ని పరామర్శించి కొమురయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించారు.
    డ్రాయింగ్ మాస్టర్ కుమారస్వామి సార్ మాట్లాడుతూ 1989లో మొట్టమొదటిసారిగా డ్రాయింగ్ మాస్టర్ గా ఆకినపల్లి గ్రామ సెకండరీ పాఠశాలలో పోస్టింగ్ రావడం ఆ సంవత్సరం నుంచే కొమురయ్యకు తనకున్న అనుబంధాన్ని కళల పట్ల ఉన్న నైపుణ్యాన్ని అభిమానాన్ని తెలుసుకొని ఆ రోజుల్లోనే కళాకారుల గ్రూప్ ని మొట్ట మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగింది.ఆ గ్రూప్ ద్వారా వివిధ నాటకాలను వేదికపై వెయ్యడం చాలా కీర్తి ప్రతిష్టలు వీరికి తెచ్చిపెట్టడం నేటికి కూడా ఆ కళను నమ్ముకున్న కుటుంబాలకి కళాకారుల పెన్షన్ రావడం లాంటి అనేక విషయాలను ఆ కుటుంబంతో పంచుకోవడం జరిగింది. తద్వారా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది.జై భీమ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ దూడపాక రమేష్ మాట్లాడుతూ కొమురయ్య డప్టిస్ట్ గా వేదిక రంగా కళాకారుడిగా పూర్వం గ్రామంలో మొట్టమొదటిసారిగా రేడియో వాడి రిపేర్ చేసినటువంటి వ్యక్తిగా, విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా నాటి కాలంలో దళితులు బతుకమ్మ నాడుకునే స్వేచ్ఛ లేకుండా ఉండేది అలాంటి కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు కూడా బతుకమ్మని ఆడుకోవచ్చు అని దళితవాడలోనే అతిపెద్ద బతుకమ్మను కొన్ని సంవత్సరాలుగా తయారు చేసి ఊరేగింపుగా చాటింపు చేసి బతుకమ్మను ఆడుకునే విధంగా మార్పు తీసుకువచ్చినటువంటి వ్యక్తి అని అలాంటి వ్యక్తి దూరం అవడం బాధాకరమని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాజకీయ్య సీనియర్ నాయకులు గండు శ్రీనివాస్,పొతారం రఘుపతి ,జై భీమ్ కమిటీ సభ్యులు బీఎస్పీ నేత దూడపాక జలంధర్, బచ్చల రామస్వామి,దూడపాక సమ్మయ్య, శ్రీపతి చంద్రమౌళి, సరిగొమ్ముల కుమార్,దూడపాక వెంకట్ తదితరులు పాల్గొన్నారు.