Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "వైసీపీ ప్లాన్ ను లైట్ తీసుకోవద్దు"- నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

    Author VENKATESH | 07 Sep 2026, 01:50 PM | ANDHRA PRADESH
    "వైసీపీ ప్లాన్ ను లైట్ తీసుకోవద్దు"- నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఫీట్ ను రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పరిస్ధితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. ప్రభుత్వంలో ఉండటంతో వైసీపీ మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశం ఉన్నా.. క్లీన్ స్వీప్ గ్యారంటీ లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Also Read కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ? ఇందులో రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఫ్యాక్ట్ తో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఉగ్రవాదుల తరహాలో హిట్ -రన్ -హైడ్ విధానాన్ని అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులపై విమర్శలకు వైసీపీ సిద్ధంగా ఉంటోదన్నారు. గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంగా ఉన్నప్పటికీ, పనులు పూర్తి కాకపోయినా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ డ్రామాలాడారన్నారు. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తే అది ఎప్పుడే పూర్తి చేసేశామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరసిస్తే గోదావరి జలాలు కావు పురుషోత్తపట్నం నుంచి వచ్చాయంటున్నారని తెలిపారు.