Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!

    Author VENKATESH | 07 Sep 2026, 01:34 PM | ANDHRA PRADESH
    కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!

    కొత్త రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటించే క్రమంలో ప్రజలకు సంబంధించి కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తున్నట్లు విజయసాయిరెడ్డివెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ రూపంలో రెండు రాజకీయ పార్టీలున్నాయని, ఆ తర్వాత స్ధానంలో జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ వంటి పార్టీలున్నాయన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లే పరిస్ధితి లేదన్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తమ పోరాట పటిమ చూపించడం లేదన్నారు. అందుకే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వస్తోందన్నారు. గత 15 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న భావన ప్రజల్లో, పార్టీల్లో ఉందన్నారు. ఈ రెండూ ఇప్పుడు ఫ్యాక్షన్ పార్టీలుగా తయారయ్యాయని సాయిరెడ్డి ఆరోపించారు. ఈ రెండు ఫ్యాక్షన్ రాజకీయ పార్టీల మధ్య యుద్దం జరుగుతోందన్నారు. ఇందులో ఒకటి రెడ్ బుక్ పార్టీ టీడీప అయితే, రెండవది రప్పా రప్పా పార్టీ వైసీపీ అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న యుద్దంలో న్యాయంవైపు ఉండాల్సిన పోలీసులు .. అధికారంలో ఉన్న వారివైపు పోరాటం చేయడం దురదృష్టకరమైన విషయం అన్నారు.ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ది కొరవడుతుందని, ప్రజల భద్రత కరవవుతుందన్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు