Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఢిల్లీ మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్రిక్తత..

    Author VENKATESH | 07 Sep 2026, 01:26 PM | NATIONAL
    ఢిల్లీ మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్రిక్తత..

    ఢిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో భవనం కూలిన ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సివిక్‌ సెంటర్‌లోని ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.
    పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భవనం కూలిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పలువురిని సహాయక బృందాలు రక్షించాయి. మున్సిపల్‌ కమిషనర్‌ రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది.ఢిల్లీలోని విద్యార్థుల వసతి గృహాలు, పేయింగ్‌ గెస్ట్‌ వసతులపై భద్రతా తనిఖీలు నిర్వహించాలని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించింది. సత్య నికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు ఐదు అంతస్తుల బాలుర పేయింగ్‌ గెస్ట్‌ భవనం కూలిపోయింది.దాని పక్కనే ఉన్న మరో భవనం కూడా కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భవనంలో బేస్‌మెంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎన్‌డీఎంసీ వైస్‌ చైర్‌పర్సన్‌ కుల్జీత్‌ సింగ్‌ చాహల్‌ తెలిపారు.శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాలను తొలగించేందుకు జేసీబీలను వినియోగిస్తున్నారు.