ఢిల్లీ మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్రిక్తత..

ఢిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో భవనం కూలిన ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సివిక్‌ సెంటర్‌లోని ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భవనం కూలిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పలువురిని సహాయక బృందాలు రక్షించాయి. మున్సిపల్‌ కమిషనర్‌ రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది.ఢిల్లీలోని విద్యార్థుల వసతి గృహాలు, పేయింగ్‌ గెస్ట్‌ వసతులపై భద్రతా తనిఖీలు నిర్వహించాలని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించింది....