Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    Author VENKATESH | 05 Sep 2026, 09:51 PM | నల్గొండ
    దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    దేవరకొండ 05 సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) : మునగల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు బీసీ సంఘం రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అధ్యాపకులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
    ​ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులు, వనరులను వివరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థులు ఏ ఒక్క తరగతిని కూడా తప్పకుండా ప్రతి తరగతికి హాజరుకావాలని, ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. కళాశాల అధ్యాపకులను సన్మానించి గౌరవించిన రాష్ట్ర బీసీ సంఘం నాయకులు డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
    ​డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఎంత సాంకేతికత పెరిగినప్పటికీ గురువు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. నేడు సోషల్ మీడియా ప్రభావం వల్ల విద్యార్థులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, ఇలాంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పుస్తకాల్లోని చదువుతో పాటు సామాజిక స్పృహను పెంపొందించి, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ దేశాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.
    ​ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, డాక్టర్ ఆర్. నాగేంద్ర, డాక్టర్ వి. మకట్లాల్, డాక్టర్ కె. రేణుక తదితర అధ్యాపకులు అలాగే బీసీ సంఘం సభ్యులు ఆర్. కోటేష్ రావు, జి. బిక్షమయ్య, పున్న వెంకటేష్, పి. గోవర్ధన్, బిక్షమయ్య, పాషా తదితరులు పాల్గొన్నారు