దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

దేవరకొండ 05 సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) : మునగల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు బీసీ సంఘం రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అధ్యాపకులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ​ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులు, వనరులను వివరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థులు ఏ ఒక్క తరగతిని కూడా తప్పకుండా...