Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంత్రి పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి..

    Author VENKATESH | 04 Sep 2026, 03:44 PM | TELANGANA
    మంత్రి పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి..

    పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కుమ్రంభీం జిల్లా సిర్‌పూర్ కాగజ్‌ నగర్‌లో బీఆర్ఎస్ పోరుబాటనిర్వహించింది. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ..కొండా సురేఖ నిన్ను తిట్టిందని మంత్రి వర్గం నుంచి తీసేశావు. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.నీకు ఏమైనా పొంగులేటి చేసే పనుల్లో 50/50 వాటా ఉందా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. బ్యాంక్‌ క్రాప్ లోన్ కోసం పోతే మా భూమి నిషేధిత జాబితాలో పెట్టారని చెబుతున్నారు. గతంలో క్రాప్ లోన్ వచ్చింది ఇప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే 22A కింద మీ భూమి ఉందని బ్యాంకులో చెబుతున్నారని హరీశ్ రావు ముందు ఓ మహిళన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.