మంత్రి పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి..
పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కుమ్రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో బీఆర్ఎస్ పోరుబాటనిర్వహించింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..కొండా సురేఖ నిన్ను తిట్టిందని మంత్రి వర్గం నుంచి తీసేశావు. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.నీకు ఏమైనా పొంగులేటి చేసే పనుల్లో 50/50 వాటా ఉందా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. బ్యాంక్ క్రాప్ లోన్...