Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారత్​లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్..

    Author VENKATESH | 04 Sep 2026, 01:51 PM | INTERNATIONAL
    భారత్​లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్..

    ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి శాంతి, చర్చల ఆవశ్యకతపై రష్యా, భారత్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని భారత్​లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. రష్యా శాంతికి సిద్ధంగా ఉందని, ఇక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉక్రెయిన్‌పై ఉందని ఆయన స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం చేస్తున్న పిలుపు రష్యా వైఖరికి అనుగుణంగానే ఉందన్నారు. ఈ వివాదానికి ముగింపు పలకడానికి భారత్ చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. "శాంతి కోసం భారత వైఖరి అందరికీ తెలిసిందే. అది స్థిరమైనది. ఆ విషయంలో మేం భారత్‌తో ఏకీభవిస్తున్నాం. దశాబ్దాలుగా రష్యా శాంతి, చర్చలకే కట్టుబడి ఉంది." అని అలిపోవ్ అన్నారు.రష్యా ఇప్పటికే తన శాంతి ప్రతిపాదనలను ముందుకు తెచ్చిందని, రాజీ దిశగా చర్యలు తీసుకుందని అలిపోవ్​ వివరించారు. అయితే, ఉక్రెయిన్ సహా దాని యూరోపియన్ మద్దతుదారులు పోరాటాన్ని కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. "మేము ఎల్లప్పుడూ శాంతికి సిద్ధంగా ఉన్నాము. అందుకోసం మేము ప్రతిపాదనలు పంపించాం. కానీ దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు ముఖ్యంగా కీవ్, యూరప్‌లోని దాని మద్దతుదారులు పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు దీనిపై నిర్ణయం ఉక్రెయిన్ పరిధిలో ఉంది (బంతి ఉక్రెయిన్ కోర్టులో ఉంది)" అని ఆయన అన్నారు.నల్ల సముద్రం ప్రాంతంలో దాడులు తీవ్రంగా పెరగడంపైనా అలిపోవ్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల భారతీయ నావికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ దాడులు సముద్ర భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని పేర్కొన్నారు. చర్చల ప్రక్రియకు తిరిగి రావాలని ఉక్రెయిన్​పై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. "ఈ ఏడాది నల్ల సముద్రంలో జరిగిన దాడుల సంఖ్య గతంతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా ఉంది. ఉక్రెయిన్ వైపు నుంచే ఈ దాడులు పది రెట్లు పెరిగాయి." అని అలిపోవ్ చెప్పారు.