భారత్​లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్..

ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి శాంతి, చర్చల ఆవశ్యకతపై రష్యా, భారత్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని భారత్​లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. రష్యా శాంతికి సిద్ధంగా ఉందని, ఇక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉక్రెయిన్‌పై ఉందని ఆయన స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం చేస్తున్న పిలుపు రష్యా వైఖరికి అనుగుణంగానే ఉందన్నారు. ఈ వివాదానికి ముగింపు పలకడానికి భారత్ చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. "శాంతి కోసం భారత వైఖరి అందరికీ తెలిసిందే. అది స్థిరమైనది. ఆ విషయంలో మేం భారత్‌తో ఏకీభవిస్తున్నాం. దశాబ్దాలుగా రష్యా శాంతి, చర్చలకే కట్టుబడి ఉంది." అని అలిపోవ్ అన్నారు.రష్యా...