Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి..

    Author VENKATESH | 04 Sep 2026, 11:14 AM | TELANGANA
    రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి..

    సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి అని మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుకొండా సుస్మితత సవాల్ విసిరారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అనంతరం సుస్మిత ఘాటుగా స్పందించారు. నా వ్యక్తిగత మాటలకు నా తల్లిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి గురించి మాట్లాడాను. అది పార్టీని విమర్శించినట్టు కాదని స్పష్టం చేశారు. నా తల్లిని ఇలా చూసి బాధ కలిగింది. ఈ అంశంలో రేవంత్ రెడ్డిని నేను శపిస్తున్నాను అని శాపనార్దాలు పెట్టింది.కాగా, మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అవ్వడానికి ముందు ఢిల్లీలో, బర్తరఫ్‌ అనంతరం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కొండా సురేఖ రేవంత్‌ సర్కార్‌, కాంగ్రెస్‌ అధిష్ఠానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించడాన్ని కొండా సురేఖ స్వాగతించారు. ‘నా ఒక్కదాన్ని తప్పించి బదనాం కాకుండా ఉండేందుకు ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించాం’ అని చెప్పుకోవటానికే ఇదంతా చేశారని పేర్కొన్నారు. తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను దండించటం ఏంది? అంటూ అనేక ప్రశ్నలు సంధించారు. తప్పులను ఎత్తిచూపారు. రేవంత్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ వైఖరిపై పలు ప్రశ్నలను లేవనెత్తారు