Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయంపై స్పందించిన చిన్నారెడ్డి

    Author VENKATESH | 03 Sep 2026, 08:21 PM | TELANGANA
    కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయంపై స్పందించిన చిన్నారెడ్డి

    వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్‌ కమిషన్ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగిం చాలని అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయంపై చిన్నారెడ్డి తొలిసారి స్పందించారు.తనకు పదవులపై సోకు లేదని స్పష్టం చేశారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఒక్క పోటుతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారని తెలిపారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. పదవులు లేకున్నా గౌరవం నాకు ఉంటుంది. పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. తన మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి హెచ్చరించినా భరించానని వెల్లడించారు.