కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయంపై స్పందించిన చిన్నారెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్‌ కమిషన్ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగిం చాలని అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయంపై చిన్నారెడ్డి తొలిసారి స్పందించారు.తనకు పదవులపై సోకు లేదని స్పష్టం చేశారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఒక్క పోటుతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారని తెలిపారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. పదవులు లేకున్నా...