Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టాస్ ఓడిన భారత్.. ఊరిస్తున్న సెమీస్ బెర్త్..!

    Author VENKATESH | 03 Sep 2026, 08:13 PM | Sports
    టాస్ ఓడిన భారత్.. ఊరిస్తున్న సెమీస్ బెర్త్..!

    ఆసియా కప్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్ ఆడుతోంది. హాంకాంగ్ చైనాను ఢీకొంటున్న టీమిండియా.. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ దూసుకెళ్లడం ఖాయం. దాంతో.. మామూలుగా కాకుండా భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది. అయితే.. టాస్ టాస్ గెలుపొందిన హాంకాంగ్ చైనా జట్టు కెప్టెన్ నటాషా మైల్స్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.తొలి విజయంతో సెమీస్‌కు చేరువైన భారత మహిళల జట్టు ఈసారి హాంకాంగ్ చైనాతో తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాకాంగ్ కెప్టెన్ నటాషా మైల్స్ బౌలింగ్ తీసుకుంది. థాయ్‌లాండ్‌ను బౌలర్ల మాదిరిగానే టీమిండియాను కట్టడి చేయాలని తాము భావిస్తున్నట్టు మైల్స్ చెప్పింది. తుది జట్టు విషయానికొస్తే హర్మన్‌ప్రీత్ బృందం ఏ మార్పులు లేకుండా ఆడుతోంది. కానీ, హాంకాంగ్ చైనా మాత్రం రెండు మార్పులు చేసింది.