Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 25ఏళ్ళుగా వేపచెట్టు కోసం గొడవ..

    Author VENKATESH | 29 Aug 2026, 04:02 PM | TELANGANA
    25ఏళ్ళుగా వేపచెట్టు కోసం గొడవ..

    తాజాగా అటువంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి సరిహద్దులో ఉన్న ఒక వేప చెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న గొడవ ఇద్దరి హత్యలకు దారితీసింది. చిన్న విషయాలపై గొడవలు పెద్ద దుర్ఘటనలుగా మారుతున్న విషాదానికి ఇది మరో ఉదాహరణగా మారింది. వేప చెట్టు నరికించటంతో ముదిరిన వివాదం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య వేపచెట్టు విషయంలో ఏళ్ల తరబడి వైరం ఉంది. 25 సంవత్సరాలుగా రెండు కుటుంబాలు చెట్టు కోసం గొడవ పడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటేశ్వర్లు కొంతమందిని పిలిచి వేప చెట్టును నరికించారు. దీన్ని గమనించిన భూక్యా సైదా కుమారుడు రాము అక్కడికి వచ్చి ప్రశ్నించాడు. గొడ్డలితో దాడి.. రెండు కుటుంబాలలో ఇద్దరు మృతి, విషాదం గొడవ పెద్దదై రాము గొడ్డలితో దాడి చేయడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన తండ్రి సైదాపై కూడా రాము దాడి చేయడంతో సైదా కూడా మరణించాడు. కేసును పక్కదారి పట్టించేందుకు తండ్రిని కూడా చంపాడని స్థానికులు చెబుతున్నారు. ఘటన తెలిసి గ్రామస్థులు రాము ఇంటిపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.