25ఏళ్ళుగా వేపచెట్టు కోసం గొడవ..
తాజాగా అటువంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి సరిహద్దులో ఉన్న ఒక వేప చెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న గొడవ ఇద్దరి హత్యలకు దారితీసింది. చిన్న విషయాలపై గొడవలు పెద్ద దుర్ఘటనలుగా మారుతున్న విషాదానికి ఇది మరో ఉదాహరణగా మారింది. వేప చెట్టు నరికించటంతో ముదిరిన వివాదం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య వేపచెట్టు విషయంలో ఏళ్ల తరబడి వైరం ఉంది. 25 సంవత్సరాలుగా రెండు కుటుంబాలు చెట్టు కోసం గొడవ పడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం...