Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.

    Author VENKATESH | 24 Aug 2026, 01:30 PM | TELANGANA
    మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.

    తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఈ కమిటీ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు (సోమవారం) సాయంత్రం ఈ నివేదికను ఏఐసీసీకి మహేశ్ గౌడ్ పంపనున్నారు. ఆమె వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం.కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె కూతురు సుస్మిత ఆరోపణలు చేస్తే సహజ న్యాయ సూత్రం ప్రకారం సురేఖ ఖండించాల్సి ఉందని.. కానీ అలా చేయలేదని ఈ కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం, పార్టీపై ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా తప్పనిసరిగా చర్యలు ఉండాల్సిందేనని ఈ కమిటీ స్పష్టం చేసింది. గతంలో కొండా సురేఖను కాపాడానని, ఇక తానేమీ చేయలేనని మహేశ్ గౌడ్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.