మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఈ కమిటీ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు (సోమవారం) సాయంత్రం ఈ నివేదికను ఏఐసీసీకి మహేశ్ గౌడ్ పంపనున్నారు. ఆమె వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం.కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె...