Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేదునూరి పిలుపు

    Author VENKATESH | 22 Aug 2026, 08:54 PM | కరీంనగర్
    నేదునూరి పిలుపు

    నింగిని గెలిచిన భారతం
    (యువత సరికొత్త
    ఆవిష్కరణలు చేయాలి )
    (ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష
    దినోత్సవం సందర్భంగా)
    శాస్త్ర సాంకేతిక రంగంలో
    అగ్రస్థాయికి చేరి మన సత్తాను
    ప్రపంచానికి చాటిన రోజు
    చిన్న దేశమని చిన్న చూపు
    చూసిన జగతికి మన విజ్ఞాన
    ప్రతిభను చూపిన రోజు
    సైకిల్ తో మొదలైన మన
    ప్రయాణం చందమామనే
    గెలిచాం
    అపజయాల పీడకలలను దాటి
    విజయ తీరాలకు చేరాము
    చందమామపై ఎగిరింది
    త్రివర్ణ పతాకం
    ఆగస్టు ఇరవై మూడవ
    తేదీన అంతరిక్ష చరిత్రలో
    నూతన అధ్యాయాన్ని
    రచించాం
    చంద్రుని దక్షిణ ధ్రువపు అంచున
    అడుగుపెట్టిన మొదటి దేశం
    ప్రపంచ దేశాల ముందు నిలిపింది
    మన ఇస్రో శాస్త్రవేత్తల మేధస్సు
    శివశక్తి అనిపేరుపెట్టి మన సత్తా
    చాటాం ప్రజ్ఞాన్ రోవర్ తో సాగింది
    చంద్రునిపై విజ్ఞాన విహారం
    శాస్త్రవేత్తల త్యాగానికి
    పట్టుదలకు ప్రతి రూపం
    ఆకాశమే హద్దు కాదు
    అంతకంటేపైకి ఎగురాలి
    శాస్త్ర వేత్తల పట్టుదలను
    యువతా శ్వాసగా
    మార్చుకోవాలి
    ఓ యువత నీ మేధస్సుకు
    పదును పెట్టీ సరికొత్త
    ఆవిష్కరణలు చేయాలి
    భారత దేశ కీర్తి జెండా
    లోకమంతా ఎగురాలి
    ఓ యువతా పరిమితులు
    ఆలోచనలకే కానీ
    నీ సంకల్పానికి కాదు
    పట్టుదల ఉంటే
    ఆకాశమే హద్దు
    అంతరిక్షాన్ని కూడా
    జయించవచ్చు
    ఓటములకు కుంగిపోకుండా
    చంద్రుడి పై జయకేతనం
    ఎగరేసిన ఇస్రో శాస్త్రవేత్తల
    స్ఫూర్తితో నవభారత
    యువత సరికొత్త
    రికార్డులు సృష్టించాలి.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎడ్యుకేషన్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్
    9440245771