నేదునూరి పిలుపు
నింగిని గెలిచిన భారతం (యువత సరికొత్త ఆవిష్కరణలు చేయాలి ) (ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా) శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రస్థాయికి చేరి మన సత్తాను ప్రపంచానికి చాటిన రోజు చిన్న దేశమని చిన్న చూపు చూసిన జగతికి మన విజ్ఞాన ప్రతిభను చూపిన రోజు సైకిల్ తో మొదలైన మన ప్రయాణం చందమామనే గెలిచాం అపజయాల పీడకలలను దాటి విజయ తీరాలకు చేరాము చందమామపై ఎగిరింది త్రివర్ణ పతాకం ఆగస్టు ఇరవై మూడవ తేదీన అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయాన్ని రచించాం చంద్రుని దక్షిణ ధ్రువపు అంచున అడుగుపెట్టిన మొదటి దేశం ప్రపంచ దేశాల ముందు నిలిపింది మన ఇస్రో శాస్త్రవేత్తల...