Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన చక్కెర ధరలు..

    Author VENKATESH | 21 Aug 2026, 02:20 PM | TELANGANA
    15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన  చక్కెర ధరలు..

    చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలోకు 14 రూపాయలు పెరగడంతో కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. నిత్యావసర సరుకుల్లో కీలకమైన చక్కెర ధర పెరగడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చక్కెర ధర పెంపుతో టీ, కాఫీతో పాటు స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించి మార్కెట్‌లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరలు మరింత పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    మరింత పెరిగే అవకాశం
    జిల్లాలో 15 రోజుల క్రితం కిలో చక్కెర ధర రూ.46 ఉండగా వారం క్రితం రూ.52కు చేరింది. ప్రస్తుతం కిలో చక్కెర ధర రూ.60 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో చక్కెర ధర రూ.65కు చేరే అవకా శం ఉందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. చక్కెర ధర పెరగడంతో ఇళ్లలో రోజువారీ విని యోగంపై కూడా ప్రభావం పడుతోంది. చక్కెర ఖర్చు పెరగడంతో పేద, మధ్య తరగతి గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావ సరాల ధరలకు తోడు మరో భారాన్ని మోయాల్సి వస్తోందని వాపోతున్నారు.
    వ్యాపారుల ముందస్తు నిల్వలు...
    చక్కెర ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో కొంత మంది వ్యాపారులు, పెద్ద వినియోగదారులు ఎక్కువగా నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో తక్షణ సరఫరా తగ్గుతోంది. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం తాజాగా బల్క్‌ వినియోగదారులపై 15 రోజుల నిల్వ పరిమితి విధించాలని నిర్ణయించింది. మార్కెట్‌ లో చక్కెర అక్రమ నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారిం చాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.