15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన చక్కెర ధరలు..

చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలోకు 14 రూపాయలు పెరగడంతో కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. నిత్యావసర సరుకుల్లో కీలకమైన చక్కెర ధర పెరగడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చక్కెర ధర పెంపుతో టీ, కాఫీతో పాటు స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించి మార్కెట్‌లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరలు మరింత పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత పెరిగే...