Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని

    Author VENKATESH | 20 Aug 2026, 01:07 PM | ANDHRA PRADESH
     ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని

    ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు అనేకం చోటు చేసుకున్నాయి. లిఫ్ట్‌లో ఇరుక్కుని కొంతమంది సురక్షితంగా బయటపడగా, మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్‌లో తమ ఫ్లోర్‌కు వెళ్లిన మహిళ.. లిఫ్ట్ ప్రమాదం బారిన పడి మృతిచెందారు. నిన్న(ఆదివారం) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒంగోలు మార్కెట్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వినీత(50) అనే మహిళ.. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్‌ ఎక్కారు. తమ ఫ్లోర్ రాగానే ముందుగా కూతురు, మనవడు బయటకు రాగా.. ఆ వెనకే వినీత కూడా బయటకు వస్తున్న సమయంలో తలుపులు తెరిచి ఉండగానే లిఫ్ట్ కిందకు కదలింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ.. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే లిఫ్ట్‌ కిందకు వెళ్లడంతో లిఫ్ట్, ఫోర్‌కు మధ్యలో ఇరుక్కుపోయారు.