ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని

ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు అనేకం చోటు చేసుకున్నాయి. లిఫ్ట్‌లో ఇరుక్కుని కొంతమంది సురక్షితంగా బయటపడగా, మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్‌లో తమ ఫ్లోర్‌కు వెళ్లిన మహిళ.. లిఫ్ట్ ప్రమాదం బారిన పడి మృతిచెందారు. నిన్న(ఆదివారం) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒంగోలు మార్కెట్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వినీత(50) అనే మహిళ.. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్‌ ఎక్కారు. తమ ఫ్లోర్ రాగానే ముందుగా కూతురు, మనవడు బయటకు రాగా.. ఆ వెనకే వినీత కూడా బయటకు వస్తున్న సమయంలో...