Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రశ్న..

    Author VENKATESH | 20 Aug 2026, 12:30 PM | ANDHRA PRADESH
    తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రశ్న..

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు. బీచ్ రోడ్డు వెంబడి తీరప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర రక్షణకు సంబంధించి సీఆర్ జెడ్ అనుమతులను త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే ప్రశ్న వేయగా.. మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ ద్వారా సీఆర్ జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. సీఆర్ జెడ్ అనుమతుల కోసం పరివేశ్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ అనుమతుల తరువాతే ఈ పోర్టల్‌లో ధరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సీఆర్ జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని తెలిపారు